: రాజేంద్రప్రసాద్ మృతికి సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ దర్శక, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ఆయన మృతిపై ప్రముఖులు స్పందించారు. రాజేంద్రప్రసాద్ ఎన్నో అద్భుత సినిమాలు నిర్మించారని, తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాదు రావడంలో ఆయన కృషిని మరువలేమని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ అన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఎంతో నిజాయతీపరుడని ఆయన పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటని, ఫిల్మ్ నగర్ లోని ఆలయనిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని సంగీత దర్శకుడు కోటి తెలిపారు.