: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పై టీడీపీ దాడి
ప్రకాశం జిల్లా ఒంగోలులో అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ పై దాడి జరిగింది. ఒంగోలులోని కలెక్టరు కార్యాలయంలో గుండ్లకమ్మ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే గొట్టిపాటి తో పాటు టీడీపీ నేత కరణం బలరాం వర్గీయులు పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం బయటకు వస్తున్న ఎమ్మెల్యేపై కరణం వర్గీయులు దాడి చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.