: బీఎం డబ్ల్యూ కొత్త టెక్నాలజీ ఎలక్ట్రిక్ కారు


జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త టెక్నాలజీ కారుతో మార్కెట్లో సంచలనం రేపేందుకు సిద్ధమవుతోంది. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న ఆటోషోలో తన కొత్త ప్రోడక్ట్, ఐ3 ఎలక్ట్రిక్‌ కార్‌ ప్రోటో టైప్‌ ను డిస్‌ ప్లేకు ఉంచింది. 4 లేజర్‌ సెన్సార్లు, స్కానర్లతో పని చేసే చేసే విధంగా సరికొత్త సాంకేతికతను దీనికి జోడించారు. కారు తనంత తానుగా పార్కింగ్‌ చేసుకునే సాంకేతికత దీనికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ కారులో రూపొందించిన ఆక్టివ్‌ ఆసిస్ట్‌ టెక్నాలజీని ఓ ప్రత్యేకమైన స్మార్ట్‌ వాచీ ద్వారా నిరోధించవచ్చని బీఎండబ్ల్యూ తెలిపింది. ఈ కారుకు ప్రమాదం కాకుండా ఉండేలా సెన్సర్లు ఏర్పాటు చేశారు. కారులో ఏర్పాటు చేసిన ఈ సెన్సర్లతో పాటు ఏర్పాటు చేసిన కెమేరాలు కారును 360 డిగ్రీలలో పర్యవేక్షిస్తాయి. సెల్ప్‌ నెట్‌ కనెక్టివిటీ ద్వారా జిపిఎస్‌ సిస్టమ్ తో ప్రయాణికులు ప్రయాణించే మార్గంలో ఉండే బ్యాంకులు, రెస్టారెంట్స్‌ వివరాలను కూడా చెప్పనుంది.

  • Loading...

More Telugu News