: విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లా గరివిడి ఎండీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గరివిడి ఫేకర్ కార్మికులు జిల్లా పరిషత్ ఛైర్మన్ బలగం కృష్ణమూర్తిని ఎండీవో కార్యాలయంలో ముట్టడించారు. ఉదయం నుంచి ఆయనను అక్కడి నుంచి కదలనీయడం లేదు. ఫేకర్ పరిశ్రమలో లాకౌట్ పేరిట శాశ్వత ఉద్యోగులను బలవంతంగా బయటికి పంపేసి, కొందరు ఉద్యోగులను ఒప్పంద పద్దతిలో నియమించడాన్ని నిరసిస్తూ కార్మికులు ఆయనను ఘొరావ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో పరిశ్రమను అక్రమంగా మూసేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అప్పటి మంత్రి బొత్సను కార్మికులు ఘొరావ్ చేసిన సంగతి తెలిసిందే.