: ఆప్ కి తలనొప్పి తెచ్చిన విజేత


ఢిల్లీ కంటోన్మెంట్ వార్డు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజేత ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఢిల్లీ వార్డు ఎన్నికల్లో ఓ వార్డు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నంద కిషోర్ ఒక సీటు గెలుచుకున్నారు. విజయం సాధించిన ఆనందంలో కార్యకర్తలతో కలిసి డబ్బును గాల్లోకి వెదజల్లారు. దీనిని ఓ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. దీంతో ఆప్ పై ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. బీజేపీకి ప్రత్యామ్నాయం అంటూ, అవినీతిని అంతం చేసే పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ చేసే చర్యలు హేయమైనవంటూ ఇతర పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆప్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News