: కోడి పందాలకు అనుమతి లేదు: పోలీసులు
సుప్రీంకోర్టు తీర్పు కోడి పందాలకు అనుకూలం కాదని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. సుప్రీం తీర్పులో యథాస్థితిని కొనసాగించడమంటే చట్టాలను అమలు చేయడమేనని, పందాలను అడ్డుకోవడమేనని వారు స్పష్టం చేశారు. ఈ కేసును హైకోర్టు పునర్విచారణ చేసిన తరువాత మాత్రమే కోడిపందాలపై పూర్తి స్పష్టత వస్తుందని వారు వివరించారు. అంతవరకు యధాతథస్థితి అంటే పందాలపై నిషేధం అని, కోడిపందాలను ఎవరైనా నిర్వహిస్తే వారిని అరెస్టు చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు.