: మోదీ, రాజ్ నాథ్ కు షాకిచ్చిన ఓటర్లు


దేశం మొత్తం మోదీ హవాలో కొట్టుకుపోతుంటే యూపీ ఓటర్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. దీంతో ఆగ్రా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహించిన లక్నోల్లోని ఒక్క స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత జరిగిన ఏడు ఉపఎన్నికల్లో బీజేపీ మట్టికరిచింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి షాకిచ్చారు. దీంతో మోదీ ప్రాతినిధ్యం వహించిన వారణాసి నియోజకవర్గంలోని 7 స్థానాలను స్వతంత్రులు క్లీన్ స్వీప్ చేశారు. అలాగే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నోలోని 8 వార్డులను స్వతంత్రులు గెలుచుకుని షాకివ్వగా, కేవలం ఒకే ఒక్క స్థానాన్ని బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బీజేపీకి మరిన్ని షాక్ లు తప్పవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News