: మోదీ హయాంలో భారత్ లో అమెరికా పెట్టుబడులు పెరుగుతాయి: అమెరికా విదేశాంగ మంత్రి


ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ అభిప్రాయపడ్డారు. మోదీ హయాంలో భారత్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో అమెరికా కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుందని ఆయన వ్యాఖ్యానించారు. వైబ్రాంట్ గుజరాత్ ముగింపు సమావేశాల సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, భారత్ లో తమ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన తర్వత ఇరుదేశాల మధ్య సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలుకానుందని పేర్కొన్నారు. మోదీ హయాంలో భారత్ లో అమెరికా పెట్టుబడులు మరింత పెరగనున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News