: శారదా కుంభకోణంలో దీదీకి షాక్... రైల్వే శాఖ మాజీ మంత్రి ముకుల్ రాయ్ కి సీబీఐ సమన్లు
పశ్చిమ బెంగాల్ లో రాజకీయ పెను తుపానుకు కారణమైన శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై, మమతకు వ్యతిరేకంగా మారిన సొంత పార్టీ ఎంపీ వ్యవహారంతో హతాశురాలైన దీదీకి ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని అరెస్ట్ చేసిన సీబీఐ ఇటీవలే షాకిచ్చింది. తాజాగా మమతా బెనర్జీకి ముఖ్య అనుచరుడిగా పేరుపడ్డ ముకుల్ రాయ్ కి సీబీఐ సమన్లు జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన ముకుల్ రాయ్ కి సీబీఐ సమన్లు జారీ చేయడంతో మమతా బెనర్జీ మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో కూరుకుపోయారు. కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ముకుల్ రాయ్ కి సీబీఐ కొద్దిసేపటి క్రితం సమన్లు జారీ చేసింది.