: బోల్తా కొట్టిన మరో పల్లె వెలుగు బస్సు... ప్రకాశం జిల్లాలో పలువురికి గాయాలు


ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన మరో పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా మడకశిర వద్ద లోయలో పడ్డ పల్లెవెలుగు బస్సు దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లా పీటీఎం మండలం మారుగానిపల్లె వద్ద రెండు రోజుల క్రితం మరో పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ముందు చక్రాలు ఊడిపోయి అదుపుతప్పిన బస్సు అనంతరం కల్వర్టును ఢీకొని కాల్వలో పడిపోయింది. తాజాగా నేటి ఉదయం ప్రకాశం జిల్లా చీరాల వద్ద ఇదే తరహాలో పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మార్టూరు నుంచి చీరాల బయలుదేరిన బస్సు మార్టూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రయాదంలో పది మందికి గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News