: బెంగళూరు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు అరెస్టు


ఇటీవల బెంగళూరులోని ఓ వీధిలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ ఇస్మాయిల్ అక్బర్ అఫక్ అనే వ్యక్తిని భత్కల్ లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సయ్యద్ పలు విషయాలు వెల్లడించాడు. పేలుడుకు నాలుగు గంటల ముందు బాంబును తయారుచేశానని చెప్పాడు. అంతేగాక హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ లో రెండేళ్ల కిందట జరిగిన జంట పేలుళ్ల బాంబులను కూడా తానే తయారు చేసినట్టు అఫక్ ఒప్పుకున్నాడు. బాంబు తయారీకి మంగుళూరులో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశానని తెలిపాడు.

  • Loading...

More Telugu News