: శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు... కలెక్టర్ తో మాట్లాడిన చినరాజప్ప
శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. టెక్కలి డివిజన్ లోని నందిగాంలో భూమి కంపించింది. దీంతో, ప్రజలు నివాసాల్లోంచి బయటికి పరుగులు తీశారు. భూప్రకంపనలపై ఏపీ హోం మంత్రి చినరాజప్ప శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. భూకంపం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన విపత్తు నిర్వహణ శాఖను ఆదేశించారు.