: తెలంగాణ పది జిల్లాల్లో... ఐదు జిల్లాలకు మహిళలే కలెక్టర్లు!
కొత్త రాష్ట్రం తెలంగాణలో మహిళా అధికారులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. మొన్నటికి మొన్న మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న స్మితా సభర్వాల్ కు ముఖ్యమంత్రి కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు, తాజాగా 24 మంది ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా మహిళా అధికారులకు గురుతర బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో పది జిల్లాలుంటే, ఐదు జిల్లాల కలెక్టర్లుగా మహిళా ఐఏఎస్ లనే నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా ఐఏఎస్ లు కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్న జిల్లాల్లో హైదరాబాద్, వరంగల్ జిల్లాలు ఉండటం గమనార్హం. తాజా బదిలీల్లో మహిళా ఐఏఎస్ లు కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్న జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-నిర్మల, వరంగల్-కరుణ, ఆదిలాబాద్-ప్రియదర్శిని, మహబూబ్ నగర్-శ్రీదేవి, కరీంనగర్-నీతు కుమారి ప్రసాద్.