: ఈ వారంలో శశి థరూర్ ను ప్రశ్నించే అవకాశం!
సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ను పోలీసులు ఈ వారంలో ప్రశ్నించే అవకాశం ఉంది. పోలీసులకు దర్యాప్తులో సహకరించేందుకు గాను థరూర్ ఆదివారం నాడు ఢిల్లీ చేరుకున్నారు. అయితే, ఐజీఐ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడలేదు. అంతకుముందు కోచి విమానాశ్రయంలో మాట్లాడుతూ, తాను పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఢిల్లీలో దిగిన వెంటనే నేరుగా లోథీ ఎస్టేట్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయన నివాసం వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. కాగా, థరూర్ ఇంటికి కొన్ని నివాసాల అవతల ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ నివాసముంటున్నారు. సునంద కేసులో దర్యాప్తును బస్సీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.