: టి-ట్వంటీ ఫార్మాట్లో విండీస్ రికార్డు ఛేజింగ్


దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో విఫలమైన వెస్టిండీస్ జట్టు టీ20 సిరీస్ లో సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్ లో ఘనవిజయం సాధించిన కరీబియన్లు రెండో మ్యాచ్ లో రికార్డు స్థాయి ఛేజింగ్ తో మ్యాచ్ ను వశం చేసుకున్నారు. జొహాన్నెస్ బర్గ్ లో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేశారు. ఫాఫ్ డు ప్లెసిస్ 119 పరుగులు చేయడం విశేషం. అయితే, విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ మరోమారు విధ్వంసకర ప్రదర్శనతో ఆతిథ్య జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 41 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. గేల్ స్కోరులో 9 ఫోర్లు, 7 సిక్సులున్నాయి. మార్లోన్ శామ్యూల్స్ (60) కూడా బ్యాట్ ఝుళిపించడంతో విండీస్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 6 వికెట్లకు 236 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. టీ20 ఫార్మాట్లో ఇదే అత్యధిక పరుగుల లక్ష్యఛేదన. కాగా, మ్యాచ్ చివర్లో కెప్టెన్ సామీ 15 బంతుల్లోనే 2 ఫోర్లు, ఓ సిక్సుతో 20* పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

  • Loading...

More Telugu News