: రామోజీ ఫిలింసిటీని నాగళ్లతో దున్నిస్తానని ఎన్నడూ అనలేదు: టీ సీఎం కేసీఆర్
రామోజీ ఫిలింసిటీలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఫిలింసిటీలో ఒక్క ఎకరం కూడా ప్రభుత్వం భూమి లేదని ఆయన వెల్లడించారు. ఫిలింసిటీకి అవసరమైన మొత్తం భూమిని రామోజీరావు ప్రైవేట్ వ్యక్తుల నుంచే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఫిలింసిటీని నాగళ్లతో దున్నిస్తానని తానెన్నడూ అనలేదని కూడా కేసీఆర్ వెల్లడించారు. ఆ తరహా వివాదస్పద ప్రకటనలన్నీ మీడియా సృష్టేనని ఆయన ఆరోపించారు. రామోజీ ఫిలింసిటీ హైదరాబాద్ కే కాక తెలంగాణకే మణిహారమని ప్రకటించిన కేసీఆర్, ఫిలింసిటీలో కొత్తగా నిర్మితమవుతున్న ఓం సిటీ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లనుందని పేర్కొన్నారు.