: సంపూర్ణ తెలంగాణ ఇంకా రాలేదు: కోదండరామ్
తెలంగాణలో ప్రజా శ్రేయస్సు ముఖ్యమని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) తీర్మానించింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఐదో వార్షికోత్సవ సదస్సు ముగింపు సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కొదండరామ్ మాట్లాడుతూ, ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణలో ప్రజా శ్రేయస్సు ముఖ్యమని తెలిపిన ఆయన, ఫిలింసిటీ అవసరమా? అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ, ఆకశహర్మ్యాలు, ఇందిరా పార్కులోని మరో హుస్సేన్ సాగర్ అవసరం లేదని అన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు సక్రమంగా అందితే అదే చాలని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధనే టీవీవీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.