: విశాఖపట్టణంలోని యారాడ కొండపై తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్టణంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం యారాడ కొండపై పెను ప్రమాదం తప్పింది. స్కూల్ లో పిక్నిక్ కు వెళ్లిన స్కూల్ బస్సు మలుపు తిరుగుతుండగా, అదుపుతప్పి కొండను ఢీ కొంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో 25 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.