: మా అబ్బాయిని భార్యే హత్య చేసింది: సంగీత దర్శకుడు చక్రి తల్లి ఫిర్యాదు
సంగీత దర్శకుడు చక్రి మృతిపై ఆయన కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. చక్రిని భార్య శ్రావణియే ఆస్తి కోసం చంపిందని ఆయన తల్లి విద్యావతి హైదరాబాదులోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చక్రిని తానే చంపానంటూ శ్రావణి తమకు ఫోన్ చేసి చెప్పిందని విద్యావతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రావణి కాల్ డేటాను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని ఆమె ఫిర్యాదులో వ్యాఖ్యానించారు. చక్రి మృతదేహానికి పోస్టు మార్టం చేయకుండా శ్రావణి అడ్డుకుందని ఆరోపించిన ఆమె, చక్రి మరణం తరువాత శ్రావణిని వేధించలేదని చెప్పారు. కాగా, చక్రి మరణం తరువాత తన అత్త, ఆడపడుచులు తనను వేధిస్తున్నారని, తన భర్త నగలు, నగదు, కారు, బీరువా లాకర్ల తాళాలు అన్నీ తీసుకున్నారని, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నారని చక్రి భార్య పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు తన భర్త పోస్టు మార్టం, దహన సంస్కారాల రిపోర్టులు కూడా ఇవ్వకుండా తీసుకున్నారని ఆమె మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే.