: రెండు కుటుంబాల మధ్య కోడిపుంజు కీచులాట
ఓ కోడిపుంజు రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. వివాదం కాస్తా పోలీస్ట్ స్టేషన్ కు దారితీసింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలో ఒక కుటుంబానికి చెందిన కోడిపుంజు తరచూ పక్కింటి కోళ్లగూడులోకి వెళ్తూ ఆ ఇంటి యజమానిని ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆ ఇంటి యజమాని ఈశ్వర్ దీన్, ఆయన భార్య రామ్ గునీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడిపుంజు కారణంగా తమ రెండు కుటుంబాలు రోజూ కీచులాడుకోవాల్సి వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గొడవపడి చుట్టుపక్కల వాళ్లకి ఇబ్బంది కలిగిస్తే రెండు కుటుంబాల మీద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.