: సంక్రాంతి సంబరాల్లో సందడి చేసిన పవన్ కల్యాణ్
నెల్లూరులో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్కూలు పిల్లలతో కాసేపు వీరిద్దరూ సరదాగా ముచ్చటించారు. పిల్లలతో పాటలు, పద్యాలు పాడించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్ అంతా విద్యార్థులపైనే ఆధారపడి ఉందని అన్నారు. భవిష్యత్ లో మెరుగైన, చక్కని భారతదేశాన్ని సాధించుకోవాలంటే బాలలు చక్కగా చదువుకోవాలని ఆయన సూచించారు. అంతా బాగా చదువుకుంటామని మాటివ్వాలని ఆయన బాలలను కోరారు. బాలలంతా ఆయనకు బాగా చదువుకుంటామని చెప్పడంతో పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.