: మరో ఇండియన్ ముజాహిదీన్ అనుమానితుడి అరెస్ట్
అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది రియాజ్ ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన వాడు రియాజ్. దుబాయ్ వెళ్తుండగా మంగళూరు విమానాశ్రయంలో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందే మరో ముగ్గురు ఇండియన్ ముజాహిదీన్ అనుమానితులను సీసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి వద్ద నుంచి జిలెటిన్, అమ్మోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.