: శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం అఖిలేష్
ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వీఎన్ సంపత్ లు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అఖిలేష్ యాదవ్ భార్యా సమేతంగా తిరుమల విచ్చేశారు. వీరిద్దరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ, దర్శనం సంతృప్తికరంగా జరిగిందని... ఇక్కడి ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు.