: నల్లధనంపై బీజేపీ యూటర్న్ తీసుకుందా?
విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కు తెప్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన బీజేపీ... ప్రస్తుతానికైతే యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాటలను పరిశీలిస్తే... ఇప్పట్లో నల్లధనం వెనక్కి రావడం అసాధ్యంగానే కనపడుతోంది. "విదేశాలలోని నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అది ఒక్క భారతదేశం చేతుల్లోనే లేదు. అంతర్జాతీయ ఒప్పందాలు దీనికి కొంతవరకు అవరోధంగా ఉన్నాయి" అంటూ ఇటీవల అమిత్ షా కామెంట్ చేశారు. ఈ మాటలను బట్టి చూస్తే, ఇప్పట్లో నల్లధనం మన దేశానికి చేరడం కష్టమే అని స్పష్టంగా చెప్పగలం.