: ట్రైన్ లో ప్రయాణికుడి నుంచి ఎనిమిది కేజీల బంగారం పట్టివేత
ఉత్తర మహారాష్ట్రలో ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి పోలీసులు 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జల్ గావ్ వద్ద హౌరా-ముంబయి జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు చేపట్టిన జీఆర్ పీ పోలీసులు దేవాంగ్ షా అనే వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.