: విక్రమ్ సారాభాయ్ అవార్డుకు షార్ డైరెక్టర్ ప్రసాద్ ఎంపిక
భారతీయ సైన్స్ కాంగ్రెస్ రెండేళ్లకోసారి విశిష్ట శాస్త్రవేత్తలకు అందించే విక్రమ్ సారాభాయ్ స్మారక అవార్డుకు షార్ డైరెక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ ఎంపికయ్యారు. దేశ ప్రగతి కోసం శాస్త్రసాంకేతిక రంగాల్లో కృషి చేసే శాస్త్రవేత్తలకు ఈ అవార్డు అందజేస్తారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ సంచాలకులు ఎం.వై.ఎన్.ప్రసాద్ ను ఎంపిక చేసినట్టు జాతీయ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.బీ. నిమ్స్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్ త్వరలో ఈ అవార్డును అందుకోనున్నారు.