: బీజేపీ భయాందోళన చెందుతోంది: కేజ్రీవాల్


ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన మాటల దాడిపై ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తిరిగి స్పందించారు. బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. "ఈరోజు జరిగిన ర్యాలీలో బీజేపీ నేతలను చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆ పార్టీ తీవ్రంగా భయపడుతోందని తెలిసింది. అంతేకాదు వారివద్ద ఢిల్లీ కోసం ఎలాంటి సానుకూల ఎజెండా లేదని తెలుస్తోంది" అని మీడియా సమావేశంలో కేజ్రీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం యూ-టర్న్ ప్రభుత్వం అని అందరూ అంటున్నారని, ఇచ్చిన హామీలపై వారెప్పుడూ వెనక్కు వెళతారని విమర్శించారు. ఆ పార్టీ ఎప్పుడూ హామీలే ఇస్తుందని, మళ్లీ కొత్తగా ఎన్నికలు వస్తే కొత్త హామీలు గుప్పిస్తారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News