: రిటైర్డ్ ఉద్యోగులతో కలసి ధర్నాలు నిర్వహిస్తాం: పొన్నం ప్రభాకర్
సీఎం కేసీఆర్, ఉద్యోగ సంఘనేతలపై తెలంగాణ కాంగ్రెస్ మాజీ నేత పొన్నం ప్రభాకర్ రుసరుసలాడరు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల నేతలు స్పందించని పక్షంలో రిటైర్డ్ ఉద్యోగులతో కలసి కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపడుతుందని హెచ్చరించారు. ఎన్జీవో నేతలు పదవీలాలసతో టీఆర్ఎస్ కు గులాంగిరీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారం చేపట్టి ఏడు నెలలవుతున్నా సకలజనుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. మూడేళ్ల క్రితం జరిగిన సకలజనుల సమ్మెలో పాల్గొన్న 20 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని ఆయన పేర్కొన్నారు.