: సినిమా హాలు వద్ద పవన్ కల్యాణ్ అభిమానుల ఆందోళన


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సాయిబాలాజీ థియేటర్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన 'గోపాల గోపాల' సినిమా విడుదల సందర్భంగా పెద్దఎత్తున అభిమానులు సినిమా చూసేందుకు వచ్చారు. ప్రదర్శన మధ్యలో సాంకేతిక లోపం ఏర్పడడంతో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. దీంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఫర్నిచర్ ను, లైట్లను ధ్వంసం చేశారు. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు, పలువురిని అదుపులోకి తీసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు.

  • Loading...

More Telugu News