: అందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోండి: సహారా గ్రూపుతో సుప్రీం


సహారా ఎండీ సుబ్రతారాయ్ బెయిల్ నిమిత్తం కొంత మొత్తాన్ని విదేశీ రుణం రూపంలో సమీకరించుకునేందుకు అవకాశం కల్పించాలని సహారా గ్రూప్ చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే విదేశీ నిధులు సమీకరించడంలో ఫెమా నిబంధనలు పాటించాలని సుప్రీం స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ఆర్బీఐ నుంచి సరైన అనుమతులు పొందాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అమెరికా సంస్థ మిరేజ్ కాపిటల్ నుంచి సహారా గ్రూప్ 1.05 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,510 కోట్లు) రుణం పొందే అవకాశం ఏర్పడింది. సహారా గ్రూప్ కు విదేశాల్లో ఉన్న మూడు హోటళ్ల వాటా తనఖా పెట్టి మిరేజ్ క్యాపిటల్ నుంచి ఈ నిధులు సమకూర్చుకోనుంది. 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్న సుబ్రతారాయ్ మధ్యంతర బెయిల్ పొందాలంటే 10,000 కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News