: రాష్ట్ర పండుగగా సంక్రాంతి సంబరాలకు గుర్తింపు: మంత్రి పల్లె
సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర పండుగ గుర్తింపు కల్పించినట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ, ముగ్గులు, గాలి పటాలు, వంటలు వంటి తదితర పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. గెలుపొందిన వారికి ప్రభుత్వం తరపున అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తిరుపతిలో 'సంక్రాంతి సంబరాలు' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.