: మోదీ అండతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యం: వెంకయ్యనాయుడు
ప్రధాని నరేంద్ర మోదీ అండ ఉంటేనే ఢిల్లీ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో కొద్దిసేపటి క్రితం బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అతిరథ మహారథులు పాల్గొన్న ఈ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఢిల్లీలో మాఫియా రాజ్యానికి చరమగీతం పాడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ అండ ఉంటేనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్న వెంకయ్య, బీజేపీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.