: ప్రధాని మోదీ ఢిల్లీ సభకు లక్ష మంది!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న ఈ సభకు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభలో మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, పియూష్ గోయల్ కూడా హాజరవుతారు. వీరే కాకుండా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వేదికను పంచుకోనున్నారు. కాగా, మోదీ ఛరిష్మాను ఢిల్లీ ఎన్నికల్లోనూ వినియోగించుకోవాలని బీజేపీ గట్టి ప్రణాళికలే వేసింది. మోదీ ప్రచారం చేయగా మూడు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కడం ఢిల్లీ బీజేపీ వర్గాల్లో ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది.