: చార్లీ హెబ్డో ఆపరేషన్ సక్సెస్... ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఫ్రాన్స్ పోలీసులు
చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి చేసిన ఉగ్రవాదులను ఎట్టకేలకు పోలీసులు మట్టుబెట్టారు. పత్రికా కార్యాలయంపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు దిగి 12 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఓ మహిళను బందీగా పట్టుకున్న ఉగ్రవాదులు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చేసిన యత్నాలు ఫలించలేదు. పగలంతా ఉగ్రవాదులతో చర్చలు జరిపిన పోలీసులు రాత్రి కాగానే ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. వారి చెరలో బందీగా ఉన్న మహిళను సురక్షితంగా విడిపించి, ఉగ్రవాదులిద్దరినీ మట్టుబెట్టారు. మరోవైపు ఇద్దరు ఉగ్రవాదులపై దాడులను నిలిపివేయాలని ఐదుగురిని బందీలుగా పట్టుకున్న మరో ఉగ్రవాదిని కూడా పోలీసులు కాల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాది చెరలోని ఐదుగురు బందీల్లో నలుగురు మృత్యువాతపడగా, ఓ వ్యక్తిని పోలీసులు విడిపించారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టడంతో ఆపరేషన్ పూర్తైనట్లు పారిస్ మేయర్ ప్రకటించారు.