: లక్ష్యం చిన్నదే... చేధనకు కు టీమిండియా సమాయత్తం, తొలి వికెట్ డౌన్!
ఆస్ట్రేలియాతో భారత్ చివరి టెస్టు, చివరి రోజు ఆట ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యం చిన్నదిగానే కనిపిస్తున్నా, ఒకే రోజులో ఛేదన సాధ్యమవుతుందా? అన్న ఆందోళన భారత క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన భారత్ ఆదిలోనే తన తొలి వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్సులో శతకంతో చెలరేగిన కొత్త కుర్రాడు లోకేశ్ రాహుల్ ఈ దఫా మాత్రం నిరాశపరిచాడు. మొత్తం 40 బంతులను ఎదుర్కొన్న లోకేశ్ 16 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత భారత స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, మురళీ విజయ్ (29)కి జతచేరాడు. 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఓ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది.