: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం పెద్దూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. లారీ ఆటోను బలంగా ఢీ కొట్టడంతో, ఆటో రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు మృతుల్లో నలుగురు మహిళలు కావడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.