: పరుగులు ధారాళంగా ఇచ్చేశాం: అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిడ్నీ టెస్టు నాలుగో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడాడు. శుక్రవారం ఆటలో ఆఖరి సెషన్లో పరుగులు ధారాళంగా ఇచ్చేశామని తెలిపాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 348 పరుగులకు చేరడం తెలిసిందే. ఆసీస్ రెండో ఇన్నింగ్సులో తాము కొత్త బంతిని సద్వినియోగం చేసుకోలేకపోయామని అన్నాడు. కంగారూ బ్యాట్స్ మెన్ బాగా ఆడారని ప్రశంసించాడు. రెండో ఇన్నింగ్సులో భువీతో కలిసి కొత్త బంతిని పంచుకున్న అశ్విన్ 4 వికెట్లు తీయడం విశేషం. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను బలిగొన్నాడీ తమిళతంబి. ఆసీస్ తన సెకండ్ ఇన్నింగ్సులో 6 వికెట్లకు 251 పరుగులు చేయడం తెలిసిందే.