: రజనీకి 'లింగ' డిస్ట్రిబ్యూటర్ల సెగ
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రం తమను నిండా ముంచిందంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు. ఆ సినిమాను కొనుగోలు చేసి తాము భారీగా నష్టపోయామని, తమ డబ్బుల్లో కొంతైనా వెనక్కి ఇచ్చేలా నిర్మాతను ఒప్పించాలని వారు రజనీకాంత్ ను కోరుతున్నారు. దీనిపై రజనీ స్పందన తెలియరాలేదు. తాము చెన్నైలో శనివారం నిరాహార దీక్షకు దిగుతామని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు హెచ్చరించారు. రజనీకాంత్ సినిమాలు సాధారణంగా భారీ కలెక్షన్లు రాబడతాయి. అయితే, వాటికి భిన్నంగా 'లింగ' చతికిలపడింది. నిర్మాణ ఖర్చులు కూడా రాలేదట. 2002లో 'బాబా' సినిమా ఇలాగే ఫ్లాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లను రజనీ ఆదుకున్నాడు. 2008లో విడుదలైన 'కుచేలన్' చిత్రం ఆడనిపక్షంలో పరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నాడు కూడా.