: నేను పీసీసీ చీఫ్ పదవి అడిగితే తప్పేంటి?: వీహెచ్


"మూడు సార్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే తప్పు లేదు కానీ, నేను పీసీసీ చీఫ్ పదవి అడిగితే తప్పా?" అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ తేవడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ప్రక్షాళనపై హైకమాండ్ నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఈనెల 20న దిగ్విజయ్ సింగ్ వస్తున్నారని ఆయన చెప్పారు. తాను పీసీసీ చీఫ్ పదవిని కోరానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News