: భారీ ఆధిక్యంలో ఆసీస్


సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. దీంతో, ఆతిథ్య జట్టు ఆధిక్యం 348 పరుగులకు చేరింది. చేతిలో 4 వికెట్లున్నాయి. ఆసీస్ జట్టులో ఓపెనర్ క్రిస్ రోజర్స్ 56, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 71, బర్న్స్ 66 పరుగులతో రాణించారు. ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ (31 బ్యాటింగ్), ర్యాన్ హారిస్ (0 బ్యాటింగ్) ఉన్నారు. ఆటకు మరొక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. అంతకుముందు, టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కోహ్లీ (147) తన ఓవర్ నైట్ స్కోరుకు మరో 7 పరుగులు మాత్రమే జోడించి అవుటయ్యాడు. అశ్విన్ 50, సాహా 35, భువనేశ్వర్ కుమార్ 30 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీయగా, హారిస్, లియాన్, వాట్సన్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News