: ఒరాకిల్ ప్రెసిడెంట్ గా బెంగళూరు బాయ్... థామస్ కురియన్ నియామకం


టెక్నాలజీ రంగంలో భారతీయుల జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్నటికి నిన్న మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల పదవీ బాధ్యతలు చేపట్టగా, తాజాగా మరో టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ప్రెసిడెంట్ గా ప్రవాస భారతీయుడు థామస్ కురియన్ ఎంపికయ్యారు. బెంగళూరుకు చెందిన థామస్ కురియన్ ను సంస్థ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ విభాగానికి ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ ప్రకటించారు. బెంగళూరు సెయింట్ జోసఫ్స్ బాయ్స్ స్కూల్ లో పాఠశాల విద్యనభ్యసించిన థామస్ కురియన్, స్టాన్ ఫర్డ్ వర్సీటీలో ఎంబీఏ పట్టా పొందారు. 1996లో ఒరాకిల్ లో వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్ డెవలప్ మెంట్) గా విధుల్లో చేరిన థామస్, సంస్థ సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషించారు.

  • Loading...

More Telugu News