: సిరియా ఇమామ్ పీక కోసిన ఐఎస్ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో దురాగతానికి తెగబడింది. సిరియా ఈశాన్య ప్రాంతంలోని అబు ఖుయుత్ గ్రామంలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఓ ఇమామ్ ను పీక కోసి చంపారు. దైవదూషణ చేశాడన్న సాకుతో అతడిని బలిగొన్నట్టు తెలుస్తోంది. ఈ ఇమామ్ ముగ్గురు కుమారులు ఐఎస్ఐఎస్ మిలిటెంట్లే. వారిలో ఒక వ్యక్తి ఇటీవల మరణించాడు. కాగా, ఐఎస్ఐఎస్ కొంతకాలంగా సాగిస్తున్న మారణహోమాన్ని వీడియోలో వీక్షించిన అనంతరం ఈ ఇమామ్ మిలిటెంట్లను బహిరంగంగానే దూషించాడు. దీంతో, ఆయనను మిలిటెంట్లు నిర్బంధంలోకి తీసుకున్నారు. గురువారం నాడు ఆయనను హతమార్చారు.