: సభ్యత్వ నమోదులో రికార్డులు నమోదు చేస్తాం: అమిత్ షాతో కన్నా లక్ష్మీనారాయణ
సభ్యత్వ నమోదులో రికార్డులు నమోదు చేస్తామని బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు హామీ ఇచ్చారు. మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్న కన్నా, ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర శాఖ సమీక్షకు వచ్చిన అమిత్ షాతో కీలక నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా కన్నా చెప్పారు. అంతేకాక పార్టీలో కొత్తగా చేరిన తాము తమ సత్తా ఏమిటో చూపిస్తామన్న రేంజిలో అమిత్ షా దగ్గర కన్నా రెచ్చిపోయారట.