: సునీల్ సాహబ్... సునంద పుష్కర్ కేసులో కీలకమితడేనట!
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు మరింత పురోగతి సాధించినట్లు విశ్వసనీయ సమాచారం. సునంద మరణానికి రెండు రోజుల ముందు హోటల్ లీలా పాలెస్ లోని సునంద గదిలో ఓ వ్యక్తి ఉన్నట్లు శశిథరూర్ ఇంటి పనిమనిషి నారాయణ్ సింగ్ సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. సదరు వ్యక్తి పేరును సునీల్ సాహబ్ గా అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే సదరు సునీల్ సాహబ్ ఎవరు, ఎక్కడి వారు, సునంద గదిలో అతడికి పనేమిటి? అన్న ప్రశ్నలకు నారాయణ్ సింగ్ వద్ద సమాధానం లేదట. దీంతో సదరు సునీల్ సాహబ్ దొరికితే కేసును ఛేదించినట్లేనని సిట్ భావిస్తోంది. దీంతో సునీల్ సాహబ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సునంద పుష్కర్ ట్విట్టర్, ఇతర ఆన్ లైన్ వ్యవహారాల్లో సునీల్ సాహబ్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.