: ఎన్నారైల ముంగిట ఏపీలోని అపార అవకాశాల చిట్టా... ప్రవాస్ భారతీయ దివస్ కు చంద్రబాబు!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలకు సర్కారు ఇస్తున్న ప్రోత్సాహకాల జాబితా ప్రవాస భారతీయుల ముందుకు రానుంది. ఇప్పటికే పలు దేశాల ప్రతినిధుల ముందుకెళ్లి విజయవంతంగా పెట్టుబడులు రాబట్టిన ఆ జాబితా, ప్రవాస భారతీయులను కూడా ముగ్ధులను చేయనుందన్న అంచనాలున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుుడు నేడు గుజరాత్ వెళుతున్నారు. ఆ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లో జరుతున్న ప్రవాస భారతీయ దివస్ లో పాల్గొనే చంద్రబాబు, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ఏపీలోని అపార అవకాశాలను వారి ముందు పెట్టనున్నారు. అంతేకాక పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి లభించనున్న ప్రోత్సాహకాలను కూడా ఆయన ప్రవాస భారతీయులకు వివరించనున్నారు.