: నేడే ‘విస్తారా’ టేకాఫ్... ఢిల్లీ-ముంబైల మధ్య తొలి విమాన సర్వీసు!
టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న విస్తారా ఎయిర్ లైన్స్ నేటి నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. నేడు ఢిల్లీ-ముంబైల మధ్య ఆ సంస్థకు చెందిన తొలి విమానం నింగికెగరనుంది. దీంతో మరో విమాన సేవల సంస్థ దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టినట్టవుతుంది. కింగ్ ఫిషర్ మూత నేపథ్యంలో విమానయాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. బిజినెస్ క్లాస్ సీట్ల లభ్యత క్రమంగా తగ్గిపోయింది. అయితే విస్తారా రంగప్రవేశంతో తిరిగి దేశీయ విమానయాన రంగంలో బిజినెస్ క్లాస్ సీట్ల లభ్యత పెరగడంతో పాటు ధరలు కూడా దిగిరాక తప్పదని ఎయిర్ టికెటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తొలి దశలో భాగంగా విస్తారా, రోజుకు 14 విమాన సర్వీసులను దేశంలోని మూడు రూట్లలో నడపనుంది.