: అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసిన తరువాతే ఇక్కడి నుంచి వెళ్తా: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాత్రి వరంగల్ లోనే వుంటున్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయన బసచేయనున్నారు. వరంగల్ లో సుమారు మూడు గంటల పాటు పర్యటించిన కేసీఆర్ పలు మురికి వాడలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు తమకు పింఛన్లు రావడం లేదని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసిన తరువాతే వరంగల్ ను విడిచి వెళ్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.