: జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పాలనకు సిఫారసు


జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడి 15 రోజులు కావస్తున్నాయి. నేటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు. దీంతో గవర్నర్ వోహ్రా గవర్నర్ పాలన విధించాలంటూ కేంద్రానికి నివేదిక పంపారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్థిరమైన ముఖ్యమంత్రి ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్న ఆయన, మెజారిటీ ఫలితాలు సాధించిన రెండు పార్టీలు ఇతరుల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలం అయ్యాయని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిని ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరితే అందుకు ఆయన అంగీకరించడం లేదని గవర్నర్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, పీడీపీ, బీజేపీ మధ్య పొత్తు వ్యవహారం తేలడం లేదు. బీజేపీ మద్దతు తీసుకుంటే పీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టి, జమ్మూ కాశ్మీర్ లో ఆ పార్టీ బలం పుంజుకునే ప్రమాదం ఉందని, అలా జరిగితే అది ఆత్మహత్యా సదృశ్యమేనని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. తమ మద్దతు లేకుండా పీడీపీ సహా ఏ పార్టీ అధికారం చేపట్టలేదని బీజేపీ ధీమా వ్యక్తం చేయగా, ఆ పార్టీకి కూడా ఏ పార్టీ మద్దతు ప్రకటించలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనకు ఆ రాష్ట్ర గవర్నర్ సిఫారసు చేశారు.

  • Loading...

More Telugu News