: గయానా అధ్యక్షుడు, మైక్రోసాఫ్ట్ సీఈవోకు 'ప్రవాస భారతీయ సమ్మాన్' పురస్కారం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రమోతర్, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సహా 15 మందికి 'ప్రవాస భారతీయ సమ్మాన్' పురస్కారం అందజేయనున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ లో ఆయన ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. కాగా, మలా మెహతా (ఆస్ట్రేలియా), కమల్ జీత్ బక్షి(న్యూజిలాండ్) నందిని టాండన్ (అమెరికా), ఆష్రాఫ్ పలరకుమ్మాల్ (యూఏఈ), రాజ్మాల్ ఎం పరాఖ్ (ఒమన్), సంజయ రాజారామ్ (మెక్సికో), జస్టిస్ దొరైకన్ను కరుణాకరణ్ (సిచెల్లస్), లార్డ్ రాజ్ లుంబా (బ్రిటన్), మహేంద్ర నాన్జీ (ఉగాండా), కమ్లేష్ లల్లూ (అమెరికా), నాథూరామ్ పూరి ఈ అవార్డులు స్వీకరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గోనున్నారు.