: బెంగళూరు పేలుళ్ల ఉగ్రవాదుల అరెస్టు


డిసెంబర్ 28న చర్చి స్ట్రీట్ ప్రాంతంలోని కోకోనట్ క్రో రెస్టారెంట్ వద్ద బాంబు పేలిన ఘటనలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని భత్కల్ పట్టణంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) అధికారులకు అప్పగించారు. కాగా చర్చి స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు, భవానీ దేవి అనే మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News